Collector Koya Sriharsha | ఓదెల, ఆగస్టు 7 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ ప్రభుత్వ దావకాలను గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దవాఖానలో సమయపాలన పాటిస్తూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
వ్యాధుల పరిస్థితి, అందుతున్న సేవలను డాక్టర్ సంజనేష్, వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలని, గర్భిణులకు ఏఎన్ఎసీ రిజిస్ట్రేషన్ 100 శాతం చేయాలని, పీహెచ్సీలో పైకప్పు మరమ్మతుల పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, పీహెచ్సీ డాక్టర్ సంజనేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.