మంథని, జూన్17 : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కార్యకర్తా స్థానిక సమరానికి సిద్ధం కావాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మంథని రాజగృహలో నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులతో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని, వరంగల్ సభను విజయవంతం చేసినట్టు ఎన్నికలకు సంసిద్ధమై బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
పదిహేడు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలపై అవగాహన పెంచాలన్నారు.
స్థానిక సమరంలో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలని, అందుకు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. అనంతరం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రస్థానం బుక్‌ను ఆవిషరించి కార్యకర్తలు, నాయకులకు అందజేశారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.