పేదల సొంతింటి కల సాకారం చేశాం
స్వరాష్ట్రంలోనే పేదల సొంతింటి కలను సాకారం చేశామని, ఆత్మగౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
- డబుల్ బెడ్రూం ఇండ్లతో ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం
- అర్హులందరికీ గృహలక్ష్మి కింద సాయం చేస్తాం
- మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, అక్టోబర్ 8: స్వరాష్ట్రంలోనే పేదల సొంతింటి కలను సాకారం చేశామని, ఆత్మగౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో రూ.1.90కోట్లతో నిర్మించిన 39 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. బుగ్గారం మండలం సందయ్యపల్లి, చిన్నాపూర్, బుగ్గారం, మద్దునూర్ గ్రామాల్లో రూ.16.10కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. సొంత స్థలం లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. స్థలం ఉన్నవారు ఇండ్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద సాయాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని నెరవేర్చాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ర్టాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఉద్ఘాటించారు. సమైక్య ప్రభుత్వాల పాలనలో పల్లెలు చీకట్లో మగ్గాయని, స్వరాష్ట్రంలో ప్రభుత్వం చర్యలతో కొత్త రూపు సంతరించుకున్నాయని చెప్పారు. పల్లెప్రగతి ద్వారా పచ్చదనం, పరిశుభ్రతతో మెరిసిపోతున్నాయన్నారు.
కాగా, సందయ్యపల్లిలో రూ.10లక్షలతో నిర్మించనున్న జీపీ భవనానికి శంకుస్థాపన చేశారు. చిన్నాపూర్‌లో రూ.2కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు, రూ.10లక్షలతో సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. అనంతరం బుగ్గారంలో రూ.8కోట్లతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డబుల్‌రోడ్డు, డివైడర్లు, సంఘ భవనాలు, రూ.5కోట్లతో సీసీ రోడ్లు, మురుగుకాలువలు, కుల సంఘభవనాలను ప్రారంభించారు. మద్దుపూర్లో రూ. కోటితో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగుకాలువలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాధినేని రాజమణి, జడ్పీటీసీ బాధినేని రాజేందర్, వైస్ ఎంపీపీ సుచేందర్, మండలాధ్యక్షుడు గాలిపెల్లి మహేశ్, మండల కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహమాన్, మండల ఆర్బీఎస్ కన్వీనర్ సత్యనారాయణరావ్, ఆయా గ్రామాల సర్పంచులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

