Vodithela Pranav | హుజురాబాద్ టౌన్, జూన్ 5: హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అధికారులతో మాట్లాడి సమగ్ర ప్రణాళిక,కార్యాచరణ రూపొందిస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ పట్టణ పరిధిలోని బుడిగ జంగాల కాలనీ లోని ముంపు ప్రాంతాలను గురువారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోని కొన్ని ప్రాంతాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కారం చూపిస్తున్నామని, రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, మండల నాయకులు, హనుమాన్ దేవస్థాన చైర్మన్, డైరెక్టర్లు, మహిళా నాయకురాల్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సెల్, సేవాదళ్, నాయకులు పాల్గొన్నారు.
ప్రమాదస్థలాన్ని పరిశీలించిన ప్రణవ్..
వరంగల్-కరీంనగర్ రహదరిలోని తుమ్మనపల్లి బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాద పరిస్థితిని ప్రణవ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానిక సీఐ కరుణాకర్ ను అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరుగుతుండడంతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.