Paruvella School | గన్నేరువరం, నవంబర్ 22 : విద్యార్థులు చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు నిర్మించుకోవచ్చని పారువెల్ల గ్రామ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకుడు తీగల మోహన్ రెడ్డి అన్నారు. పారువెల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు శనివారం ఆయన వాటర్ ప్యూరిఫైర్ బహుమతిగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోనే భవిష్యత్ మారుతుందని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్ నిర్మాణమవుతుందని చెప్పారు. పాఠశాల విద్యార్థుల దాహార్తిని తీర్చి స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి రూ.15 వేలు విలువగల వాటర్ ప్యూరిఫైర్ అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.