KTR | రాజన్న సిరిసిల్ల, జూన్ 18( నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టీ హరీష్ రావు పర్యటించారు. సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు ఆశ్విన్ రావు ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. అశ్విన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సిరిసిల్ల లోని జిల్లా దహన లో తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ లో పానీపూరితిని తీవ్ర అస్వస్థకు గురైన చిన్నారులను దవాఖానలో పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం సిరిసిల్లలోని సీనియర్ జర్నలిస్ట్ టీవీ నారాయణను పరామర్శించారు. ఇటీవలే టీవీ నారాయణ తల్లి వెంకటలక్ష్మి మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్,బొల్లి రామ్మోహన్, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.