రేవంత్ రెడ్డి, అదానీ ఫొటోలతో కూడిన టీషర్టులు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు బయలు దేరిన వారిని అసెంబ్లీ గేటు-2 వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ‘రేవంత్, అదానీ బాయి బాయి’ ‘ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ’ ‘తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్ తల్లి నీది.. బతుకమ్మను తీసి చేయి గుర్తు పెట్టింది’ అంటూ నినదించారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితతోపాటు పార్టీ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేశారు.