కరీంనగర్ విద్యానగర్, జనవరి 31 : కరీంనగర్ జిల్లాకేంద్రంలోని చైతన్యపురి (జగిత్యాలరోడ్)లో విజేత సూపర్ మార్కెట్‌ను శుక్రవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్మార్ట్‌సిటీ కరీంనగర్లో సూపర్ మార్కెట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
అనంతరం విజేత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురకొండ సందీప్ దరి, మారెటింగ్ డైరెక్టర్ మురకొండ సిద్దార్థ మాట్లాడారు. 1999లో ప్రారంభించిన విజేత సూపర్ మార్కెట్ ఒక బ్రాండ్‌గా నిలిచిందని, 25 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తున్నదని చెప్పారు.
ఇప్పుడు కరీంనగర్లో ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఈ అవకాశాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు. అన్ని జిల్లాల్లో విస్తరిస్తామని, కస్టమర్లకు నాణ్యమైన సేవలందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రేగులపాటి పాపారావు, కే నరేందర్ రెడ్డి, సునీల్‌రావ్, బండ సుమ రమణారెడ్డి, కాకిరాల రమేశ్, సీఏ ఎళ్లంకి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.