Vigilance officers | పెద్దపల్లి, ఆగస్టు23: పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్(హైదరాబాద్) అడిషనల్ ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో శనివారం విచారణ చేపట్టారు. ఆర్టీవో, ఎంవీఐ కార్యాయాలను పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు తదితర విషయాలపై దరఖాస్తుదారులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే ఆరుగురు ఏజెంట్లను మోటార్ వెహికల్ కార్యాలయ ఆవరణలో విచారించారు. విచారణ నివేదికను పై అధికారులకు అందజేస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో రంగారావు, సిబ్బంది పాల్గొన్నారు.