Venkateswara Swamy Kalyanam | కమాన్ చౌరస్తా, జూన్ 11 : జిల్లా కేంద్రంలోని మంకమ్మతోట వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూనీల సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా సాగింది. అనంతరం సాయంత్రం పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పిట్టల శ్రీనివాస్, కార్యనిర్వాహణ అధికారి నాగారపు శ్రీనివాస్ భక్తులకు ఇబ్బందులు కలగకుండా దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.