అణగారిన వర్గాలు ‘ఆది’కి కనిపించలేదా!
మున్సిపల్ పాలకవర్గ పదవుల్లో అణగారినవర్గాల బిడ్డలు మన బీసీ బిడ్డ, వేములవాడ ఎమ్మెల్యేకు కనిపించలేదా అని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు.
- అత్తెసరు మారులతోనే కాంగ్రెస్ పాసైంది
- రెండున్నర ఏండ్లుగా కాలయాపన తప్పా చేసిందేమీ లేదు
- ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ నిలిచింది
- వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు
వేములవాడ, ఫిబ్రవరి 18: మున్సిపల్ పాలకవర్గ పదవుల్లో అణగారినవర్గాల బిడ్డలు మన బీసీ బిడ్డ, వేములవాడ ఎమ్మెల్యేకు కనిపించలేదా అని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో మీరు అత్తెసరు మారులతోనే పాసయ్యారనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలం కావడంతోనే పూర్తి మెజార్టీ రాలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లను చూస్తుంటే.. ఇంకా ప్రజలు కేసీఆర్ను గుండెల్లో పెట్టుకున్నారన్న విషయం అర్థమవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం వేములవాడలోని తన నివాసంలో మాట్లాడారు.
వేములవాడ పురపాలక సంఘం కౌన్సిలర్ ఎన్నికల్లో బీసీల తర్వాత అత్యధికంగా దళిత సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లు గెలిచిన కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రెండు పదవులు బీసీ సామాజిక వర్గానికి కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. ఇతర సామాజిక వర్గాలపై ఇంత వివక్షత ఎందుకని మండిపడ్డారు. ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిని ప్రలోభానికి గురిచేసి రాజ్యాంగాన్ని అవమానపర్చాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ గెలిచింది ఐదు స్థానాల్లో అయినా మరో ఐదు స్థానాల్లో అతి తకువ మెజార్టీతో ఓడించారని ఆరోపించారు. రెండున్నర ఏండ్లలో ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ చేసిందేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజన్న గుడికి రూ.150కోట్లు వెచ్చించామని డబ్బా కొడుతున్న శ్రీనివాస్.. బీఆర్ఎస్ హయాంలో సేకరించిన 35ఎకరాల్లోనే అభివృద్ధి జరుగుతుందన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. సమావేశంలో కౌన్సిలర్లు రామతీర్థపు మాధవి, వెంగళ అనిత, వాసాల లావణ్య, సీనియర్ నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, రామతీర్థపు రాజు, వెంగళ శ్రీకాంత్గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేశ్, గన్నమనేని రామారావు, సిరిగిరి రామ్చందర్, మండలాధ్యక్షులు గోసుల రవి, మల్యాల దేవయ్య, నాయకులు గుడూరి మధు, గుడిసె సదానందం, సలీమ్, రేగుల రాజేశం, ఉల్లెందుల లక్ష్మీహన్మంతు, నిమ్మశెట్టి రాజు, గోసుల నర్సయ్య, పబ్బ మహేశ్, మొట్టల మహేశ్, పైడి శ్రీనివాస్, చేపూరి రవీందర్, సందీప్, ప్రశాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

