విద్యానగర్, మే 24 : కరీంనగర్ నూతన మెడికల్ కళాశాలలో ప్రభుత్వం ఏక మొత్తంలో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జనరల్ సర్జరీ 4, జనరల్ మెడిసిన్, ఓబీజీ, అనస్థీసియా విభాగాల్లో మూడేసి చొప్పున, పిడియాట్రిక్స్ లో ఇద్దరు, అనాటమీ, పిజియాలజీ, బయెకెమిస్ట్రీ, పాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, డీవీఎల్, సైకియాట్రీ, రెడియోడయోగ్నోసిస్, అర్థోపెడిక్స్, ఈఎన్టీ, అడ్మినిస్ట్రేషన్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 26 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించడం దేశ చరిత్రలోనే మొదటిసారని మంత్రి కొనియాడారు. ఈ నియామకాలతో జిల్లా ప్రజలకు, పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందడంతో పాటు లక్షలాది రూపాయల ఖరీదు చేసే వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు.