Konaraopet | కోనరావుపేట, ఆగస్టు 16: మండలంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఊరురా ఉత్తికొట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చిన్నారులు గోపికల వేషాధారణలో అలరించగా, డీజే పాటలతో నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. యువకులు ఆనందోత్సవాల మధ్య ఉత్తికొట్టే వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మామిడిపల్లి గ్రామంలో అరె సంఘం, ధర్మారంలో శ్రీకృష్ణయాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. మహిళలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొనగా స్వీట్ పంపిణీ చేశారు. ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి ఈ వేడుకల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు.