ఇబ్రహీంపట్నం, జూలై 3 : రైతన్నను యూరియా కష్టం వెంటాడుతున్నది. వానకాలం సీజన్ మొదలై మక్క పంట వేసే అదును దాటిపోతున్నా అందడం గగనమే అవుతున్నది. అందుకు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరడమే నిదర్శనంగా నిలుస్తున్నది. బుధవారం రాత్రి 450 యూరియా బస్తాలు వచ్చాయని సమాచారంతో గురువారం ఉదయం పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. గంటల తరబడి పడిగాపులు పడ్డా రు. ఒకానొక దశలో ఎగబడ్డారు. అయితే ముందు వచ్చిన రైతులకు మూడు బస్తాల చొప్పున పంపిణీ చేయడం, లైన్లో ఉన్న చాలా మందికి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందించాలని కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ ఉత్త మాటలే. చేసేదేం ఉండదు. రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతంది. వానకాలం మొదలై ఇన్ని రోజులైనా యూరియా అందించకపోతే పంటలు ఎలా పండిస్తాం. గత ప్రభుత్వంలో ఇలా లేదు. సీజన్‌కు ముందే సరిపడా ఎరువులు తెప్పించి పెట్టిన్రు. రైతులకు ఏ బాధ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని కావాల్సినంత యూరియా తెప్పించాలె.