Urea distribution | గన్నేరువరం, ఆగస్టు30: యూరియా కోసం రైతులు నిత్యం నరకయాతన పడుతున్నారు. చేతికి వచ్చిన పంటలకు యూరియా వేయాల్సి ఉండగా.. అందుకు అనుగుణంగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 450 యూరియా రాగా టోకెన్లు ఇచ్చిన రైతులకు ఆధార్ కార్డుకు రెండు బస్తాల చొప్పున శనివారం పోలీసుల పహారాలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవని కాంగ్రెస్ పాలన రైతుకు శాపంగా మారిందని సర్కార్ తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతుకు తగినంత యూరియా అందించాలని డిమాండ్ చేశారు.