VEMULAWADA RAIN | వేములవాడ రూరల్, ఏప్రిల్ 10: అకాల వర్షంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నారు. చేతికి వచ్చే పంట రాత్రి కురిసిన వర్షానికి దెబ్బ తింది. దీంతో రైతన్న కు అప్పులే మిగిలిన పరిస్థితి నెలకొంది. వేములవాడ రూరల్ మండలంలోని బొల్లారం లింగంపల్లి, హనుమాజీపేట, మర్రిపల్లి, నాగయ్య పెళ్లి తదితర గ్రామాలలో రాత్రి కురిసిన వర్షానికి వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది.
ఈదురుగాలితో కూడిన వడగళ్ల వాన కురవడంతో చేతికి వస్తదనుకునే పంట నీలపాలైంది. బొల్లారం, లింగంపల్లి గ్రామాల్లోని ఇప్పటివరకు దాదాపు 100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు తోడు వడగండ్లు వర్షం రాత్రి కురవడంతో ఉదయాన్నే పంట చేనుకు వద్దకు వెళ్లిన రైతన్నకు కన్నీళ్లు మిగిలాయి. వడ్లు నెలరాలడంతో చేసేది ఏం లేదు రైతన్న బోరున విలిపించారు.
కష్టపడి పండించిన పంట రాత్రికి రాత్రే నేల పాలు కావడంతో రైతన్న తన గోడును కన్నీటితో తన బాధను వెళ్ళబుచ్చారు. ఓవైపు సాగునీరు విద్యుత్ సరిగా అందక అప్పులు చేసి పంట సాగు చేసిన రైతన్నకు ఇప్పుడు కన్నీళ్లు మిగిలాయి.
పంటను పరిశీలిస్తున్న అధికారులు
రాత్రి వడగళ్ల వాన వర్షం పడటంతో చేతికి వచ్చిన పంట నేల పలుకోవడంతో పంట నష్టం జరిగిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పంట నష్టం పై అంచనా వేయాలని ఉన్నతాధికారులకు ఆదేశించడంతో వ్యవసాయ అధికారి ఏఈఓ బొల్లారంలో పర్యటించి పంట నష్టం సర్వే చేపడుతున్నారు. కాగా అకాల వర్షంతో తీవ్ర నష్టం జరిగిందని పంటకు పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.