విద్యానగర్, జూలై 7: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లందకుంట, కొండగట్టు ఆలయాలను రామాయణ సర్యూట్ కింద అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ సీంలో చేర్చుతామన్నారు. కరీంనగర్- హసన్‌పర్తి రైల్వేలైన్ సాధ్యాసాధ్యాలపై రూ.20 కోట్లతో చేపట్టిన సర్వే పనులు పూర్తయ్యాయన్నారు. ఈ లైన్ వస్తే ఈ ప్రాంతం ఎంతో అ భివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఆదివారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరు అడగడం వల్లే స్మార్ట్ సిటీల గ డువు పెంచలేదని, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు సైతం గడువు పెంచాలని కోరడంతోనే దేశంలోని పొడిగింపు వచ్చిందని వెల్లడించారు. కాగా, గడువు పొడిగింపుతో కరీంనగర్ కార్పొరేషన్‌కు మరి న్ని నిధులు వచ్చే అవకాశముందని చెప్పారు. ఇక బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎంపిక అంశం పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని అధ్యక్షుడిని చేయాలనే దానిపై ఆలోచించి అడుగు వేస్తుందని చెప్పారు. త్వరలో పార్టీ ప్రెసిడెంట్‌ని అధిష్టానం ప్రకటిస్తుందన్నారు.