Train Accident | పెద్దపల్లి రూరల్ జూన్ 21 : పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లిలో గుర్తు తెలియని సుమారు 55-60 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం లభ్యమైనట్లు రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. కొత్తపల్లిలో మూసి వేయబడి ఉన్న కొత్తపల్లి రైల్వే గేట్ ద్యారా రైలు పట్టాలు దాటుటకు ప్రయత్నించగా డౌన్ లైన్ లో వెళ్లే దూరంతో ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొనగా కొంత దూరం ఈడ్చబడి శరీరం ముక్కలై కాళ్ల భాగం రైలు పట్టాలపై పడి ఉన్నాయని, తల భాగం ట్రైన్ ఇంజన్ ముందు భాగములో ఇరుక్కొనగా కాజీపేట రైల్వేస్టేషన్ లో గమనించి తల భాగాన్ని బయటకు ఆయన పేర్కొన్నారు.
మృతురాలు వద్ద ఎరుపు రంగు చీర, మెరూన్ రంగు కలవు. ఆమె వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు గాని వస్తువులు గాని లేవు. రైలు పట్టాలపై పడిఉన్న శరీర భాగలను తీసుకుని వెళ్లి శవాన్ని వరంగల్ ఎంజీఎం దవాఖానలోని మార్చరీ లో భద్రపర్చి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి తెలిపారు. సదరు మహిళ వివరాలు తెలిసిన వారు సంబంధీకులు ఎవరైనా ఉంటే 9949304574, 8712658604 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.