suicide | కాల్వశ్రీరాంపూర్, మార్చి 2 : భార్యకాపురానికి రావడంలేదని ఒంటరితనం భరించలేక కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన కందుకూరి రాజ్‌కుమార్ (37) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన రాజ్‌కుమార్ తన భార్య మౌనిక ఐదు సంవత్సరాల క్రితం అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆమె కాపురానికి రావడంలేదని, తన భార్య ఇంటి నుండి వెళ్లి పోయినప్పటి నుండి ఒంటరిగా ఉంటూ మధ్యానికి బానిసయ్యాడు.
మద్యం మత్తులో ఒంటరితనం భరించలేక ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి రాజేశ్వరి తెల్లవారుజామున లేచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడి ఉన్నాడు. చుట్టు పక్కల వారు గమనించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు.