Appointed | ధర్మారం, జనవరి 9 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ తుమ్మల రాంబాబు ధర్మారం బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడిగా నియమించినట్లు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా టౌన్ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఈ క్రమంలో మండలంలోని అతిపెద్ద గ్రామం ధర్మారం కావడంతో పార్టీ బలోపేతం చేయాలని మాజీ మంత్రి ఈశ్వర్ సంకల్పించారు.
దీంతో మాజీ ఎంపీటీసీ తుమ్మల రాంబాబును టౌన్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ శుక్రవారం నియామకం ఉత్తర్వులు జారీ చేశారు తనను పార్టీ టౌన్ అధ్యక్షుడిగా నియమించిన ఈశ్వర్ కు రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ధర్మారం పట్టణంలో స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీని పటిష్ట పరిచేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.