పెద్దపల్లి, జనవరి17: సాగు, గృహావసరాల కోసం నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని ఉద్యోగులు, సిబ్బందికి టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మ న్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి సూచించారు. టీఎస్ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) పీ మోహన్‌రెడ్డి, డైరెక్టర్ (ఐపీసీ) పీ గణపతి, డైరెక్టర్ (కమర్షియల్) సంధ్యారాణి, డైరెక్టర్ (పైనాన్స్) తిరుపతిరెడ్డితో కలిసి బుధవారం పెద్దపల్లిలో సర్కిల్ విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడు తూ, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, 33 కేవీ, 11 కేవీ ఫీడర్లలో అంతరాయాలు తగ్గించాలని సూచించారు. వినియోగదారులతో సత్సంబంధాలను పెంపొందించుకోవాలని, అంకిత భావంతో పనిచేసి సం స్థ పురోగతిలో భాగస్వాములు కావాలని నిర్దేశం చేశారు. ఇంజినీర్లు, సిబ్బంది వినియోగదారులకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీకి చెందిన 515 మంది వినియోగదారులు కులధ్రువీకరణ పత్రా లు సమర్పించలేదని, వారుఏఈ (ఆపరేషన్) కార్యాలయంలో అందించి 101యూనిట్లకు రాయితీ పొందాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం గృహజ్యోతి స్కీం కింద వినియోగదారుడికి 200 యూనిట్ల రాయితీ పథకానికి అర్హ్హులు కావాలంటే తప్పకుండా విద్యుత్ మీటర్ నంబర్ ఉండాలని, కనెక్షన్ లేని వారు వెంటనే మీసేవలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వ్యవసా య విద్యుత్ కనెక్షన్ (ఏజీఎల్) కోసం మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. వినియోగదారులు బకాయిలు చెల్లించి సంస్థ పురోభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. సమావేశంలో పెద్దపల్లి ఎస్ ఈ బొంకూరి సుదర్శన్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.