కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జూలై 17 : నీట్ -2026 ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు ఘన విజయం సాధించారని విద్యాసంస్థల నిర్వాహుకులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను అభినందించి మాట్లాడారు. తమ కళాశాలకు చెందిన డీ అశ్విత 534 మారులు, జే శ్రీవైత్రి 512, జే అశ్విని 491, హనీఫా 486, విష్ణువర్ధన్ 480, ఎన్ కీర్తన 472, ఎం అక్షయ 460, ఫరీహా తెహరీమ్ 460, ఏ కావ్య 456, ఎం అజయ్ 453, యు శ్రీనిధి 445, పీ కీర్తన 445, షైనీ 443, డీ జ్యోష్న 441, షిఫా మహవీన్ 439, ఎన్ సాత్విక 434, వీ హర్షిత 433, ఎస్ నివేదిత 432, కే అంజలి 426, జే సౌమ్య 424, జీ అనుశ్రీ 424, ఎస్ అలేఖ్య 422, కే వెన్నెల 420, ఈ అక్షయ 413, ఏ శృతి 409, ఎన్ దేవికకృష్ణ 407, వంశీ 405, ఆర్ సాయికిరణ్ 401 మారులతో ముందు వరుసలో నిలిచారన్నారు.
ఈ సందర్భంగా వారిని విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి అభినందించి మాట్లాడారు. విద్యార్థులు మరోసారి ట్రినిటీ విజయ పరంపర కొనసాగిస్తూ అద్భుత మార్కులు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఒక యజ్ఞం అని, అందులో తమ విద్యార్థులు పూర్తి నిబద్ధతతో విజేతలుగా నిలిచారని చెప్పారు. ఇక్కడ కళాశాల డైరెక్టర్ దాసరి మమతారెడ్డి, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.