BRS leader | చిగురుమామిడి, సెప్టెంబర్ 1 : చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు ఆంజనేయులు అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, బీఆర్ఎస్ నాయకులు సోమవారం వారి నివాసానికి వెళ్లి మృతదేహం వద్ద పుష్ప గుచ్ఛం వేసి నివాళులర్పించారు. ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు.
పార్టీ అండగా ఉంటుందని, అన్ని విధాల ఆదుకుంటామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. నివాళులర్పించిన వారిలో జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, ఆర్బీఎస్ మండల మాజీ అధ్యక్షుడు పెనుకుల తిరుపతి, నాయకులు చెరుకు సంజీవ్ తదితరులు న్నారు.