Veenavanka | వీణవంక, జూన్ 7: వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామంలో శ్రీ భవానీ శంకర దేవాలయంలో పార్వతి పరమేశ్వరుల కల్యాణం శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణాల మధ్య ఉదయం హోమాలు, మధ్యాహ్నం శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు.
అనంతరం మహా అన్నదానం చేశారు. గ్రామానికి చెందిన కాంతాల ఆగారెడ్డి రూ.లక్ష పదివేల విలువగల కిలో వెండితో చేయించిన పాము పడగ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఛైర్మెన్ జెన్నారపు శివకుమార్, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.