ఇరిగేషన్ భూముల్లో ‘దశాబ్ది’ వనాలు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జలవనరుల శాఖ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. కాకతీయ కాలువ వెళ్లే మండలాల్లోని గ్రామాల్లో కెనాల్‌కు ఇరువైపులా ఉన్న ఇరిగేషన్ శాఖ స్థలంలో మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
- కరీంనగర్ జిల్లాలో 14 చోట్ల స్థలాల గుర్తింపు
- కాకతీయ కాలువకు ఇరువైపులా 33.65 ఎకరాల్లో 16,265 మొక్కల పెంపకం
- పూర్తయిన ఫెన్సింగ్ నిర్మాణం
- ఇప్పటికే 4,435 గుంతలు సిద్ధం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జలవనరుల శాఖ హరితహారం నిర్వహణకు సన్నద్ధ మైంది. జిల్లావ్యాప్తంగా కాకతీయ కాలువకు ఇరువైపులా 14 చోట్ల 33.65 ఎకరాల్లో 16,265 వనాలు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ఇప్పటికే గ్రామాల వారీగా స్థలాలను గుర్తించి ఫెన్సింగ్ కూడా పూర్తిచేసింది. ఇప్పటికే 4,435 గుంతలను తవ్వించింది.
– కరీంనగర్ కలెక్టరేట్, జూలై 1:
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జలవనరుల శాఖ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. కాకతీయ కాలువ వెళ్లే మండలాల్లోని గ్రామాల్లో కెనాల్‌కు ఇరువైపులా ఉన్న ఇరిగేషన్ శాఖ స్థలంలో మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్యాక్రాంతమవుతున్న ఇరిగేషన్ శాఖ భూములను కాపాడుకోవడంతో పాటు పండ్ల మొక్కలు నాటితే అదనపు ఆదా యం కూ డా చేకూరుతుండడం, హరితహారంలో భాగస్వాములయ్యే అవకాశముండడంతో సంపద వనాల ఏర్పాటును ఆ శాఖ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అర ఎకరం నుంచి ఐదెకరాల దాకా..
దశాబ్ది వనాల పెంపకంలో భాగంగా అర ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు భూమి సేకరించి మొక్కలు నాటేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇల్లందకుంట మండలం రాచపల్లి, టేకు ర్తి, గన్నేరువరం గ్రామాల్లో అర ఎకరం చొప్పున, తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లో 0.75 ఎకరం, చిగురుమామిడి మండలం ముల్కనూర్, రామడుగు మండలం గుండి, శ్రీరాములపల్లి, గం గాధర మండలం ఇస్లాంపూర్, కేశవపట్నం మం డలం తాడికల్ గ్రామాల్లో ఎకరం చొప్పున, తి మ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లో 1.75 ఎకరాలు, ఇల్లందకుంట మండలం మల్యాల, గం గాధర మండలం ర్యాలపల్లి, రామడుగు మం డలం లక్ష్మిపూర్ గ్రామాల్లో 2 ఎకరాల చొప్పున, సైదాపూర్ మండలం వెన్కెపల్లి, చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామాల్లో 3 ఎకరాల చొప్పున, గంగాధర మండలం గర్శకుర్తి, కొత్తపల్లి మండలం ఎలగందల్, మానకొండూర్ మండ లం ముంజంపల్లి, ఈదులగట్టేపల్లి గ్రామాల్లో ఐదు ఎకరాల చొప్పున ఇరిగేషన్ శాఖ భూమిని గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఫెన్సింగ్ కూడా చేసి, గేట్లు బిగించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 4435 గుంతలు కూడా తీశారు. ఈ స్థలాల్లో నాటేందుకు అవసరమైన మొక్కలు కూడా సమీప ప్రాంతాల్లోని నర్సరీల నుంచి సేకరిస్తున్నారు. పండ్ల మొక్కలతో పాటు దీర్ఘకాలికంగా ఆదాయాన్నిచ్చే టేకు, ఎర్రచందనం లాంటి మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు పడగానే ఉపాధి హామీ కూలీలతో మొ క్కలు నాటించనుండగా, ఆయాచోట్ల ఏర్పాటు చేసిన సంపద వనాలను పరిరక్షించేందుకు ఆశాఖలోని కిందిస్థాయి సిబ్బందికి విధులు కేటాయించనున్నట్లు తెలుస్తున్నది.
మొక్కలను సిద్ధం చేశాం..
రాష్ట్రం ఏర్పటి పదేండ్లు పూర్తయిన సందర్భం గా దశాబ్ది సంపద వనాల పేరిట తమ శాఖ ఆధీనంలోని భూముల్లో వనాలు పెంచాలని నిర్ణయించాం. జిల్లాలో 14చోట్ల స్థలాలను గు ర్తిం చాం. నీటి వసతి ఉన్న చోట ఇప్పటికే మొ క్కలు నాటగా, వర్షాధార ప్రాంతాల్లో ఒకటి, రెండు వా నలు పడగానే మొక్కలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే గుంతలు కూడా తీయగా, నాటేందుకు మొక్కలను కూడా సిద్ధం చేశాం.
– శంకర్, ఈఎన్సీ, కరీంనగర్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

