గోదావరిఖని/ ఫర్టిలైజర్‌సిటీ అక్టోబర్ 26: కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడ్డ కార్మికులను స్వపరిపాలనలో కంటికి రెప్పలా కాపాడుకున్నది సీఎం కేసీఆరేనని రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. వారు ఊడగొట్టిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. గురువారం ఆర్జీ-1 జీడీకే-2వ గని, రామగుండం 14, 39 డివిజన్లలో ప్రజా అంకిత యాత్ర చేపట్టారు. ఆయనకు స్థానికులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కార్మికులు, కాలనీవాసులను ఆత్మీయంగా పలుకరించారు. సర్కారు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. సింగరేణి మనుగడ బీఆర్ఎస్ సర్కారుతోనే సాధ్యమన్నారు. కారుణ్య నియామకాల ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. తన విజ్ఞప్తి మేరకు సకల జనుల సమ్మె కాలంలో పూర్తిస్థాయిలో వేతనాలు ఇచ్చారని, కరోనా సమయంలో వేతనంతో పాటు తెలంగాణ ఇంక్రిమెంట్‌ను మంజూరు చేశారని చెప్పారు. గతంలో సీఎం అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వేచిచూడాల్సి వచ్చేదని, కానీ నేడు టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత నేతృత్వంలో సమస్యలు సత్వరమే పరిష్కారమవుతున్నాయన్నారు.
సైనికులతో సమానమని వారికి ఐటీనుంచి మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన పార్లమెంట్లో ఆమోదించలేదన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే కేంద్రం మెడలు వంచైనా ఐటీ రద్దుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ హాయాంలో జరిగిన కుంభకోణాలను సాకుగా చూపి బీజేపీ సర్కారు.. గనులను ప్రైవేట్‌పరం చేయడానికి చేపట్టిన వేలం పాటకు వ్యతిరేకంగా తాను నిరహార దీక్ష చేసానన్నారు. ఈ ప్రాంత యువతకు ఉద్యోగాల కల్పన కోసం 30 కోట్ల తో ఐటీ పార్కు, స్పిన్నింగ్ మిల్లు స్థానంలో అంతర్గాంలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ఇటీవల మంత్రి కేటీఆర్‌తో శంకుస్థాపన చేయించామన్నారు. ఓట్ల కోసం డబ్బు మూటలతో వచ్చే నాయకులను నమ్మవద్దని కోరారు.
కాగా, 39వ డివిజన్లో సుమారు 200 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమాల్లో టీబీజీకేఎస్ నేతలు కెంగర్ల మల్లయ్య, నూనె కొంరయ్య, గండ్ర దామోదర్, మాదాసు రాంమ్మూర్తి, వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, జాహిద్ పాషా, మండ రమేశ్, పొలాడి శ్రీనివాస్, వడ్డెపల్లి శంకర్, వెంకటేశ్, వంగ శ్రీనివాస్, పీచర శ్రీనివాస్, మారుతి, పర్లపల్లి రవి, నూతి తిరుపతి, దాసరి శ్రీనివాస్, నందు, కొంరయ్య, సాయి, తిరుపతి, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు నీలపద్మ గణేశ్, జెట్టి జ్యోతి, నాయకులు సింహాచలం, రత్నాకర్, కిష్ణస్వామి, జక్కుల తిరుపతి, పల్లే శ్రీనివాస్, అనుముల భద్రయ్య, రాజిరెడ్డి, ప్రభంజన్‌రెడ్డి, రామస్వామి, దేవేందర్, రాజేశ్, రేణుక, రాజమణి, ఓదెల, రవి, రాజబాబు, కొమురయ్య, రవీందర్ ప్రవీణ్, భార్గవి, సీతా, మాలతి, కేతక్క ఉన్నారు.