ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 19 : వడగండ్ల వాన, ఈదురుగాలులతో పంట నష్టపోయి న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు రూ.25వేలు అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. శనివారం జగిత్యాల జి ల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి, కో జన్ కొత్తూర్, కేశాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలం ముత్యంపేటలో పర్యటించారు. శుక్రవారం రాత్రి కురిసిన వడగళ్ల వాన, ఈదురు గాలులతో దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారులతో కలిసి పరిశీలించారు. ఎర్దండిలోని వొడ్డెర కాలనీ లో వడగళ్ల వాన, ఈదురు గాలులతో గుడిసెలు దెబ్బతిన్న బాధిత కుటుంబాలను ప రామర్శించి, 27 మందికి రూ.3 వేల చొ ప్పున రూ.81 వేలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో వడగళ్ల వానతో పంటలు తీవ్రం గా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం నష్టపోయి న రైతులకు ఎకరాన రూ.25వేలు అందించాలన్నారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావుకు ఫోన్‌చేసి, కోరుట్ల నియోజకవర్గంలో పంట న ష్టాన్ని వివరించారు. అలాగే పంట నష్ట వివరాలను సర్వేచేసి ఉన్నతాధికారులకు పం పించాలని ఏవోకు సూచించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం వడగళ్ల వానతో నష్టపో యిన రైతులకు నష్టపరిహారం అందించి ఆ దుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, ఏడీఏ రమేశ్, తహసీల్దార్ ప్రసాద్, మండల వ్యవసాయాధికారి రాజ్‌కుమార్, ట్రాన్స్‌కో ఏడీ మనోహర్, ఏఈ భూమేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు బద్దం గోపి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దశరథ్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నేమూరి సత్యనారాయణ, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నల్ల రమేశ్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.