రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు ఉగాది కానుక అందించింది. ఇటీవల ఇచ్చిన హామీ మేరకు వారికి పేస్కేల్ వర్తింపజేస్తూ జీవో 11 ద్వారా శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానుండగా, వివిధ కేడర్లలో ఉన్న సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కరీంనగర్ స్వశక్తి కళాశాలలోని సెర్ప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, ఇతర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
– కలెక్టరేట్, మార్చి 18
కలెక్టరేట్, మార్చి 18 : సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తమ సర్వీసు కాలంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు అందుకోవడం గగనకుసుమమే అనుకున్న సెర్ఫ్ ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేస్తూ, ఉగాది కానుకను అందించబోతున్నది. ఇటీవల ఇచ్చిన హామీ మేరకు వారికి పేస్కేల్ వర్తింపజేస్తూ, జీవో 11 ద్వారా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానుండగా, ఒక్కో ఉద్యోగికి కనిష్టంగా రూ.19వేల నుంచి రూ.59వేల వరకు, గరిష్టంగా రూ.51వే ల నుంచి రూ.1.28లక్షల వరకు వేతనాలు పెరుగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,978 మంది వివిధ కేడర్లలోని సెర్ఫ్ సిబ్బందికి లబ్ధి పేస్కే ల్ వర్తించనుండగా, ఉమ్మడి జిల్లాలో 359 మంది వరకు, కరీంనగర్ జిల్లాలో 117 మంది కి లబ్ధి కలుగనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2002 లో ప్రారంభమైన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో జిల్లా స్థాయిలో అడిషనల్ డీఆర్డీవో, డీపీఎం, మండల స్థాయిలో ఏపీఎం, సీసీలు, ఎంఎస్‌సీసీలు, డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, అ డ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్లు, ప్రాజెక్టు సెక్రటరీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, తదితర మినిస్టీరియల్ ఉద్యోగులుగా తాత్కాలిక పద్ధతిన నియమితులై విధులు నిర్వహిస్తున్నారు. సీమాంధ్ర పాలకు లు వీరితో వెట్టిచాకిరీ చేయించుకుంటూ, నామమాత్రపు వేతనాలు మాత్రమే అందజేశారు.
ఎన్ని ఆందోళనలు, నిరసనలు చేపట్టినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. అయితే, స్వరాష్ట్రం సిద్ధించగానే వీరికి పేస్కేల్ వర్తింపజేయాలం టూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సాం కేతిక కారణాల నేపథ్యంలో జాప్యం కాగా, తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో సమస్య పరిష్కారం లభించిం ది. కొత్త ఆర్థిక సంవత్సరంలో నిబంధనల మేర కు అర్హులైన వారందరికీ పేస్కేల్ వర్తింపజేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో, జిల్లాలోని సెర్ప్ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
సెర్ప్ ఉద్యోగుల కోరికను గమనించి ఏళ్ల నాటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో, పేస్కేల్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు విడుదల చేయగా, నగరంలోని స్వశక్తి కళాశాలలోని సెర్ప్ కార్యాలయంలో శనివారం సిబ్బంది సీఎం కేసీఆర్, ఇతర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమం లో పాల్గొన్న టీఎన్ఎంఈవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శనాల భువనచంద్ర మాట్లాడు తూ, 23 ఏళ్లుగా పెరగని నిర్ణీత వేతనాలతో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ము ఖ్యమంత్రి ఉగాది కానుకగా తమకు పేస్కేల్ ప్రకటించడం మాజీవితాల్లో మరుపురానిదన్నా రు. గత మార్చి 15న అసెంబ్లీలో చేసిన ప్రకటన మేరకు సవరించిన వేతనాలతో కూడిన పే స్కేల్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు విడుదల చేసి, తన మంచితనాన్ని మరోసారి నిరూపించుకున్నాడని ము ఖ్యమంత్రిని కొనియాడారు. నెలకు రూ.58కోట్లకు పైగా ఆర్థిక భారం పడుతున్నా తమ కుటుంబాల శ్రేయస్సు ఆలోచించిన మా నవతావాది సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సిబ్బంది రవీందర్, కు మార్, కే రామ్మోహన్, ఎం.సంపత్, సీ హెచ్.ర ఘుపతయ్య, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు.