MLA SANJAY | కోరుట్ల, ఏప్రిల్ 11:సంఘ సంస్కర్త, కుల వ్యవస్థ నిర్మూలనకు పాటుపడిన మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు యువతకు ఆదర్శనీయమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసినా ఎమ్మెల్యే నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పూలే గొప్ప సంఘ సoస్కర్త అని, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలన, మహిళోద్ధరణకు ఎంతో కృషి చేశాడని కొనియాడారు. పూలే సతీమణి సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలని తెలిపారు. అణగారిన వర్గాలకు విద్యను అందించాలనే లక్ష్యంతో బాలికల కోసం మొదటి పాఠశాలను పూణేలో ఏర్పాటు చేశారని తెలిపారు. యువత జ్యోతిబాపూలే సేవలను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, మాజీ కౌన్సిలర్లు పేర్ల సత్యం, సునీల్, నాయకులు సురేందర్, నగేష్, అతిక్, అన్వర్, వినోద్, రహీం పాషా తదితరులు పాల్గొన్నారు.