రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పిఠాపురంలో’. మహేశ్చంద్ర దర్శకుడు. ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘మక్కుళు మక్కుళు కాలేజూ’ అనే పాటను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. జీసీ క్రిష్ స్వరపరచిన ఈ పాటను శ్రీరామ్ తపస్వి రచించారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. మూడు విభిన్నమైన ప్రేమకథలతో హాస్యం, భావోద్వేగాలు ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించారని, తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ వారంలోనే ట్రైలర్ను విడుదల చేస్తామని దర్శకుడు మహేశ్చంద్ర తెలిపారు. జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీసీ క్రిష్, కథ: ఆకుల సురేష్ పటేల్, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎమ్ మురళీ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మహేశ్చంద్ర.