MLA SANJAY | కోరుట్ల, ఏప్రిల్ 25: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో పాత్రికేయుల పాత్ర అభినందనీయమని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వెన్నంటి ఉద్యమంలో నిలిచారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. పట్టణశివారు శివసాయి గార్డెన్లో పాత్రికేయులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వన పత్రికలను పాత్రికేయులకు శుక్రవారం అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తీసుకువచ్చారన్నారు. రూ.60 వేల కోట్ల రాబడి ఉన్న తెలంగాణ కేసీఆర్ పాలనలో ఆర్థికంగా నిలదొక్కుకొని రూ.3 లక్షల కోట్ల రాబడి సాధించిందని చెప్పారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశంలోనే ఆర్థికాభివృద్ధిలో నంబర్ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
సాగు, తాగునీరు, 24 గంటల కరెంట్ నిరంతరం అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో స్థూల ఉత్పత్తిని పెంచుకొని దేశానికి ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలిచిందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను ఆశీర్వదించేందుకు ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభకు హజరు కావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చీటి వెంకట్రావు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.