Vemulawada | వేములవాడ, జనవరి 25 : ఓటు హక్కు ప్రతీ ఒక్కరి బాధ్యత అని వేములవాడ ఆర్డివో రాధాబాయి అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం లో భాగంగా తహసీల్దార్ కార్యాలయం నుండి తెలంగాణ చౌక్ వరకు ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించగా ఆమె హాజరై మాట్లాడారు. 18 సంవత్సరాల నుండిన ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు.
స్వతంత్ర భారతదేశంలో పరిపాలనను నిర్దేశించేది ఓటు హక్కు ద్వారానే వివరించారు. అలాంటి ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ నమోదు చేయించుకోవడమే కాకుండా బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ సురేష్, ఆర్ఐలు శ్రీనివాస్, శ్రీధర్, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.