Korukanti Chander | పెద్దపల్లి కమాన్, ఆగస్టు 15 : ఎందరో మహనీయల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా స్వతంత్ర భరత్ ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 79 స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో కలిసి కోరుకంటి చందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర ఉద్యమ స్పూర్తితో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తెలంగాణ ఉద్యమాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో నిలిచిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేసిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు. ఇక్కడ నాయకులు ఉప్పు రాజ్ కుమార్, గోపు ఐలయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.