పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
గ్రేటర్లో పారిశుద్ధ్య నిర్వహణపై మరింత ఫోకస్ పెట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శానిటేషన్ నిర్వహణపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల కల్లా ప్రధాన రహదారుల వెంట చెత్త పూర్తిగా తొలగించి క్లీన్గా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
- జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో పారిశుద్ధ్య నిర్వహణపై మరింత ఫోకస్ పెట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శానిటేషన్ నిర్వహణపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల కల్లా ప్రధాన రహదారుల వెంట చెత్త పూర్తిగా తొలగించి క్లీన్గా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, ఎస్డబ్ల్యూ డీఈఈలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. శానిటేషన్ బాధ్యత ప్రధానంగా డిప్యూటీ కమిషనర్లు, ఎస్డబ్ల్యూఎం డీఈఈలదేనని పేర్కొన్నారు. గ్రీన్ వెస్ట్ తొలగింపు బాధ్యతను కూడా ఇకపై ఎస్డబ్ల్యూం విభాగమే నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో శానిటేషన్ అదనపు కమిషనర్ రవి కిరణ్, జోనల్ కమిషనర్లు ప్రియాంక అలా, మందా మకరందు, ముకుందారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు, ఎస్డబ్ల్యూఎం డీఈఈ, రాంకీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

