DRDA | సారంగాపూర్, జనవరి 20 : గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీఏ రఘువరణ్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్, లక్ష్మిదేవిపల్లి, నాగునూర్ గ్రామాల్లో మంగళవారం పర్యటించి ఉపాధి హామీ పనుల నిర్వహణ, వన వనర్సరీలను పరిశీలించి వివరాలు తెల్సుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లో నాటు వేస్తుండడంతో కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తున్నప్పటికీ ఉపాధి హామీ పనుల్లో కూలీల కోరత లేకుండా చూడాలన్నారు. గ్రామాల్లో ఉపాధి పనులకొచ్చిన టార్గెట్ను పూర్తి చేయాలని సూచించారు.
ఆయా గ్రామాల్లో ఉపాధి కూలీలతో మాట్లాడి వివరాలు తెల్సుకున్నారు. వన నర్సరీలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎండీడి సలీం, ఏపీవో శ్రీలత, ఆయా గ్రామాల సర్పంచులు మ్యాకల శేఖర్, చేకూట అరుణ, దామోర రుషేంద్ర, గ్రామ కార్యదర్శులు సంతోష్ కుమార్, సర్వశ్రేష్ట ఆరీఫ్, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు తదితరులు పాల్గొన్నారు.