Dharmaram | ధర్మారం,సెప్టెంబర్ 19: జీవో ఎంఎస్ నెంబర్ 25 ను సవరించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలాల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీ మురళీధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సంఘ సభ్యత్వంలో భాగంగా శుక్రవారం మాట్లాడారు. ప్రాథమిక పాఠశాల అనేది విద్యా వ్యవస్థకు పునాది లాంటిదని ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయుల సంఖ్య పెంచినట్లయితే బాల్య దశలో ఉన్న విద్యార్థులు నాణ్యమైన విద్యను అందుతుందని అన్నారు.
ప్రస్తుతం 60 మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు టీచర్ల తో బోధన అభ్యసన ప్రక్రియ ఉంటుందని, దీనివల్ల విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి జరగదని తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటూ,పాఠశాల పరిపాలనా విధులు మాత్రమే నిర్వహించేందుకు ప్రతీ ప్రాథమిక పాఠశాలకు ఒక పీఎస్ హెచ్ఎంను కేటాయించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ,జిల్లా నాయకులను మండల కమిటీ సభ్యులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచ్చ మురళి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు అత్తె రాజారాం, తాళ్లపల్లి రమేష్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోట శ్రవణ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కే మల్లారెడ్డి, రాష్ట్ర సంఘటన కార్యదర్శి నూతి మల్లన్న, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కే మధుసూదన్ రెడ్డి, జిల్లా ఆర్థిక కార్యదర్శి పులి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సంఘటన కార్యదర్శి సముద్రాల ప్రవీణ్ కుమార్, ధర్మారం, కటికనపల్లి, కొత్తూరు హెడ్మాస్టర్లు మల్లారెడ్డి, మోతిలాల్ నాయక్, ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు.