ప్రజాహితుడు..‘పరిపాటి’
ప్రజాహితమే తన అభిమతమని పాటుపడిన మహోన్నత నాయకుడు పరిపాటి జనార్దన్‌రెడ్డి అని, అలాంటి మ హనీయులను నిత్యం స్మరించుకోవాలని మండ లి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కొనియాడారు.
- మహనీయులను నిత్యం స్మరించుకోవాలి
- మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి
జమ్మికుంట, ఏప్రిల్ 28: ప్రజాహితమే తన అభిమతమని పాటుపడిన మహోన్నత నాయకుడు పరిపాటి జనార్దన్‌రెడ్డి అని, అలాంటి మ హనీయులను నిత్యం స్మరించుకోవాలని మండ లి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కొనియాడారు. శుక్రవారం జమ్మికుంట కేవీకేలో జీఎన్ఎన్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్‌రెడ్డి విగ్రహావిష్కరణలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయతో కలిసి పాల్గొన్నారు.
అలాగే కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్ తండ్రి అంకూస్ సంవత్సరికంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంకూస్, పరిపాటి ఫొటోలకు పూలదండలు వేసి, నివాళులర్పించారు. తర్వాత వక్తలు మాట్లాడారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిపాటి, సమాజిక సేవలోనే కొనసాగారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్పర్సన్ రాజేశ్వర్‌రావు, దేశిని స్వప్న-కోటి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఉన్నారు.
‘పరిపాటి’ జీవితం ఆదర్శనీయం..
పరిపాటి జనార్దన్‌రెడ్డి జీవితం ఆదర్శనీయం. ఆయన అడుగు జాడల్లో నేటి సమాజం న డవాలి. మా నాయన(పీవీ) సంస్కరణలు దేశానికి ఉపయోగపడ్డాయి. మహనీయుల పరిచయాలతో మమ్మల్ని ప్రభావితం చేశాయి. అంకితభావం, పట్టుదల నాయకులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి మహానుభావులు ప్రజల గుం డెల్లో నిలిచిపోతారు. సేవకు రాజకీయమే అవసరం లేదని, గొప్ప మనుసుంటే సరిపోతుంది.
– సురభి వాణిదేవి, ఎమ్మెల్సీ
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

