Government school | సుల్తానాబాద్ రూరల్ మే 28: పో టితత్వం పెరుగుతున్న తరుణంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన నిర్వహిస్తున్నారు. అయితే రా నుంచి డిప్యూటేషన్ పై బొంతకుంటపల్లికి ప్రధానోపాధ్యాయులు తుల సుధాకర్ రావు 2024 జులై 15 కు వచ్చాడు.
అప్పటినుంచి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా పాఠశాల ప్రత్యేకతలపై ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. ఇంటింటా తిరుగుతూ నాణ్యమైన విద్య బోధనలు వివరిస్తూ బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని పిల్లల తల్లిదండ్రులను కోరుతున్నారు. ఎనిమిది మంది ఉన్న విద్యార్థులను 16 మంది వరకు అయ్యేలా కృషి చేశారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో పాఠశాల మరమ్మతుల కోసం కలెక్టర్ కలిసి పాఠశాల పరిస్థితి గురించి వివరించారు.
దీంతో కలెక్టర్ స్పందిస్తూ రెండు విడుత లలో రూ.3 లక్షల 50 వేలు ఇచ్చారు. ఒక కిటికీ, ఒక దర్వాజా, మరుగుదొడ్ల నిర్మాణాలు నీటి సరఫరా, నీటి సంపు, అదనంగా రెండు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టారు. గ్రామానికి నాలుగు దిక్కులలో ఉన్న విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చేందుకు గ్రామస్తులతో మాట్లాడి వారి సహకారంతో ఆటోను ఏర్పాటు చేసి విద్యార్థులను పాఠశాలకు తీసుకువస్తున్నారు. పాఠశాల రోడ్డుకు దగ్గర్లో ఉండడంతో ప్రస్తుతానికి పిల్లల రక్షణ కోసం ట్రీ గార్డులతో గేటును ఏర్పాటు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనను అందించడంతోపాటు పుస్తకాలు, దుస్తులు అందించడం జరుగుతుందని పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాలతో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి పాఠశాలలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు.
నాణ్యమైన విద్య బోధన అందిస్తున్నాం .. తులా సుధాకర్ రావు, ప్రధానోపాధ్యాయులు