గంగాధర, డిసెంబర్ 14 : ఉమ్మడి రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన పండుగలకు పూర్వ వైభవం తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ నిర్వహణపై నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన పాస్టర్లతో మండలంలోని బూరుగుపల్లిలో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అధికారికంగా పండుగలను నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గుర్తు చేశారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలను రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా జరుపుకునేలా కానుకలు అందిస్తున్నదని కొనియాడారు. క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు పాస్టర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు.