 
                                                            Pegadapally | పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. జతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ఇందులో పాల్గొన్న ఎస్సై కిరణ్ కుమార్ మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, యువత సన్మార్గంలో పయనిస్తూ, దేశ సమగ్రతకు పాటు పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, పలు పార్టీల నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
 
                            