Kalvakuntla Vidyasagar Rao | కోరుట్ల, ఆగస్ట్ 15: కోరుట్ల పట్టణవాసులు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన జెండా వందనం కార్యక్రమానికి హజరైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యా సాగర్ రావు త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. ఆయా వార్డుల్లో వివిధ కుల, యువజన సంఘాలు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ పార్టీ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జెండా పండుగను కనుల పండువుగా జరుపుకున్నారు.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఆనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు, పోలీస్ స్టేషన్లో సీఐ సురేష్ బాబు, కోర్టు ఆవరణలో న్యాయమూర్తి అరుణ్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల స్వాతంత్ర్య సమరయోధుల వేషాధారణలు ఆకట్టుకున్నాయి. ఆయా కార్యక్రమాల్లో మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.