BC reservation | చిగురుమామిడి, నవంబర్ 13: బీసీలకు 42 శాతం అమలు అయ్యేంతవరకు పోరాటం ఆగదని హక్కుల కోసం ధర్మ పోరాటం చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు మండల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవీందర్ పాల్గొని అనంతరం మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అగ్రకుల ఆధిపత్యం లో నడిచే రాజకీయ పార్టీలని బీసీలకు ను ఓటు బ్యాంకుగా రాజకీయంగా వాడుకుంటున్నారన్నారు.
2019లో బిజెపి ప్రభుత్వం పది శాతం కూడా లేని అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించినప్పుడు 56 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంలో అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ అయినా, నాయకుడైన కుట్రపూరితంగా వ్యవహరిస్తే బీసీల ఆక్రోసానికి రాజకీయ సమాధి తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ దీక్షలో మండల అధ్యక్షులు శ్రీ రామోజు రాజ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్, ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షులు తాళ్ల నరేష్, జిల్లా కార్యదర్శి చెల్పూరి విష్ణుమాచారి, గ్రామ శాఖ అధ్యక్షులు సంపత్, మొగిలి, శ్రీనివాస్, రాజు, సంపత్, కోశాధికారి పెసరీ శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జ్ రాజు, సాయికుమార్, దశరథం, బాలకృష్ణ చారి, కిషన్, హరీష్, లక్ష్మీనరసింహ, వెంకటాద్రి, ఐలయ్య, హరీష్, కనకయ్య, అనిల్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.