Chalmeda Lakshmi Narasimha Rao | తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.. బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మి నరసింహారావు
అబద్దాల హామీతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వేములవాడ రూరల్ చెందిన క్రికెట్ క్రీడాకారులకు సోమవారం క్రికెట్ కిట్ లను అందజేసి మాట్లాడారు.
- మళ్లీ కేసీఆర్ పాలన కోసం ప్రజలంతా ఎదురుచూపులు
- క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలని సూచన
Chalmeda Lakshmi Narasimha Rao | వేములవాడ, మే 4 : అబద్దాల హామీతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వేములవాడ రూరల్ చెందిన క్రికెట్ క్రీడాకారులకు సోమవారం క్రికెట్ కిట్ లను అందజేసి మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తుందని అన్నారు. మళ్లీ మరోసారి సీఎంను కేసీఆర్ చేయాలని యువత చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, క్రీడాకారులను ప్రోత్సహించడానికి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ లో కాంగ్రెస్ కరువు ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నరని, అబద్దపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మర్చిపోయాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోసారి కెసిఆర్ ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. కేటీఆర్ ముఖ్యమైన మంత్రి, ఆయన సహకారంతో రానున్న రోజుల్లో వేములవాడ ను అభివృద్ధి చేసుకుందామన్నారు. కేసీఆర్ కప్ తో క్రికెట్ క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తి పెంపొందడమే కాకుండా గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులు తమ ప్రతిభను చాటారన్నారని కొనియాడారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపేందుకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందున్నారని గుర్తు చేశారు. క్రికెట్ ఏ కాకుండా భవిష్యత్తులో కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ల నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు.
టోర్నమెంట్ లో పాల్గొన్న అన్ని జట్లకు కేటీఆర్ ఆదేశాల మేరకు క్రికెట్ కిట్లను అందజేసి వారికి ప్రోత్సాహంగా ఉండడమే కాకుండా భవిష్యత్లో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులను వెలికి తీస్తామని తెలిపారు. అనంతరం యువతకు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై అవగాహనా కల్పించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి చల్మెడ ఎప్పుడు అండగా ఉంటారని, హాస్పిటల్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నరని కొనియాడారు. వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు చల్మెడ వస్తే అభివృద్ధి జరుగుతుందే, కేసీఆర్ వస్తే కరువు లేకుండె అంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు చల్మెడ కే పట్టం కడుతారని, పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గోస్కుల రవి, గడ్డం హనుమాన్లు, ఏష తిరుపతి, మల్లేశం, బాల్ రెడ్డి, యవకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

