Chigurumamidi | చిగురుమామిడి, మే 1 : చిగురుమామిడి మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా కనుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మధ్య స్వామివారికి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కల్యాణోత్సవము తిలకించడానికి భారీగా తరలివచ్చారు.
ఈ వేడుకల్లో ఆలయ ఈవో రాజకుమార్, ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, ఆలయ రికార్డు అసిస్టెంట్ బూట్ల కవిత, శేషం నరసింహచార్యులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.