హోరాహోరీగా.. రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం
మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో శుక్రవారం 55వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలను ఖోఖో అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి, అల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహణ అధ్యక్షుడు, సర్పంచ్ ఏలేటి మమత- నర్సింహారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు
- పాల్గొన్న 20 జట్లు
కొడిమ్యాల, అక్టోబర్ 21 : మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో శుక్రవారం 55వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలను ఖోఖో అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి, అల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహణ అధ్యక్షుడు, సర్పంచ్ ఏలేటి మమత- నర్సింహారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లాల నుంచి 20 జట్లు పాల్గొన్నాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, పావురాలను ఎగరేసి క్రీడాపోటీలను ప్రారంభించారు. కొడిమ్యాల ఇండో స్కూల్, విస్డమ్ పాఠశాలలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
పలువురు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలన్నారు. క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, ఎంపీటీసీ సభ్యురాలు జమాల్పురి రాజేశ్వరి, ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మహేందర్రావు, ప్రధానోపాధ్యాయులు నాంపల్లి మల్లేశం, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రఘుపతి రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాస్, శ్యాంప్రసాద్, పోచప్ప, కృష్ణప్ప, స్థానిక క్రీడాకారులు రవీందర్, కృష్ణంరాజు, బల్ల మల్లేశం, డేవిడ్సన్, లక్ష్మణ్, అనిల్, మోహనాచారి, గుర్రం నర్సయ్య తదితరులు ఉన్నారు.

Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Karimnagar
- kho kho
- state
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

