కరీంనగర్, జూన్ 2(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ ఆధ్యక్షతన జరిగిన దశాబ్ది ముగింపు వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొని కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపి, ప్రసంగించారు.
ఇక్కడ ఉమ్మడి జిల్లా నుంచి సిరిసిల్ల, కరీంనగర్, హుజూరాబాద్, జగిత్యాల ఎమ్మెల్యేలు కేటీఆర్, గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్, బీఆర్ఎస్ కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులు బోయినపల్లి వినోద్‌కుమార్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు కోలేటి దామోదర్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.