Teachers’ Day | ధర్మారం, సెప్టెంబర్ 5: ధర్మారం మండల కేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు కందుకూరి భాస్కర్, గోనె సత్యం, శ్రవణ్ కుమార్, కరుణాకర్, సతీష్, సౌజన్య, శ్రీలత, స్రవంతి, సత్యం లను క్లబ్ సభ్యులు శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు ఇప్ప మల్లేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది వారిని సమాజంలో ఉత్తమ పౌరులుగా తయారు చేసేది గురువులేనని అన్నారు. అలాంటి గురువుల సేవలను గుర్తించి, గౌరవించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ తరపున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఇప్ప మల్లేష్, డిస్ట్రిక్ అడ్మిన్ సామ ఎల్లారెడ్డి, డిస్ట్రిక్ పీఆర్వో తన్నీరు రాజేందర్, జోనల్ ఛైర్ పర్సన్ పీ మునీందర్ రెడ్డి, రీజియన్ చైర్ పర్సన్ టీ రవీందర్ శెట్టి, సెక్రటరీ బూతగడ్డ రవి, వైస్ ప్రెసిడెంట్ బొట్ల లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.