Junior colleges | సారంగాపూర్ , మే 5: మండలంలోని రేచపల్లి గ్రామంలో సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇంటింటికి సోమవారం కరపత్రాలు, బ్యానర్లతో వెళ్లి తమ కళాశాలలోనే ఇంటర్మీడియట్ చదివేందుకు అడ్మిషన్ తీసుకోవాలని ప్రచారం నిర్వహించారు. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా విద్యా బోధన చేస్తున్నామని జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతంలో సారంగాపూర్ కళాశాల రెండవ స్థానంలో నిలిచిందని కళాశాల ప్రత్యేకతలను వివరించారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు కళాశాల ప్రత్యేకతలు, విద్యా బోధన గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వై రమేష్ బాబు, అధ్యాపకులు శ్రీధర్, రాజు, సౌజన్య, సుజాత, వెంకటేశ్వర్లు, సంపత్ రావు, శ్రావణ్ ఆర్య , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.