Taxi driver | జగిత్యాల రూరల్ జూన్ 24 : తనకు రావాల్సిన రూ.30 వేలు ఓ వ్యక్తి దగ్గర నుండి ఇప్పించాలని కోరుతూ పురుగుల మందు డబ్బాతో టాక్సీ డ్రైవర్ కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ గ్రామానికి చెందిన గోవిందుల కొమురవెల్లి తనకు ముత్యాల మల్లేశం గత ఏడాది క్రితం తన టాటా ఎస్ వాహనంలో తర్బూజా తోటకు సుమారు 15 రోజులు పని చేశాను. అలాగే తర్బూజ కాయలను తన వాహనంలో తరలించినందుకు రూ.30వేల వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. కానీ గత ఏడాది నుండి ఎన్నిసార్లు అడిగినా తనకు డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు టాక్సీ జీవనాధారం అని టాక్సీ నడుపుకుంటూ జీవించే తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయాడు. దిక్కులేని పరిస్థితుల్లో ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినట్లు పేర్కొన్నారు. తన డబ్బులు తనకు ఇప్పించి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చిన అతడిని పోలీసులు అక్కడి నుండి తీసుకెళ్లారు.