VEENAVANKA | వీణవంక, ఏప్రిల్ 3 : కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మల్లారెడ్డిపల్లిలోని గుడుంబా స్థావరంపై దాడి చేసి నాటుసారా, బెల్లంపానకాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ నాగేశ్వర్రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మల్లారెడ్డిపల్లిలో దాడులు నిర్వహించగా లోకిని పోచయ్య అనే వ్యక్తి వద్ద 10 లీటర్ల నాటుసారా, 200 లీటర్ల బెల్లం పానకం లభించినట్లు చెప్పారు. కాగా తయారీ సామాగ్రి ధ్వంసం చేసి అతనిపై కేసునమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మోసిన్, కానిస్టేబుల్స్ కుమార్ యాదవ్, కమలాకర్, సంతోష్ సాయి, కాసింబి పాల్గొన్నారు.